తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో భారీ సంఖ్యలో 3,039 ఉద్యోగాల భర్తీ జరగనుంది. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అందించి మెప్పు పొందిన తరవాత, నిరుద్యోగులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రకటించారు.
నిర్ణయం ముఖ్యాంశాలు:
- TGSRTCలో క్రొత్తగా 3,039 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
- జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేస్తామని, వేములవాడ, ధర్మపురి, కొండగట్ల వంటి ప్రముఖ క్షేత్రాలను కలిపే రవాణా ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.
- రాష్ట్ర ఆవిర్భావ సమయంలో RTCలో 55,000 మంది ఉద్యోగులుండగా, ప్రస్తుతం 40,000 మాత్రమే ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
- 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్ చేయడం ద్వారా పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
మహిళల సంక్షేమం:
- మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు.
గత పదేళ్లుగా RTCలో కారుణ్య నియామకాలు మినహా కొత్త నియామకాలు జరగకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే, రేవంత్ రెడ్డి సర్కార్ తాజా నిర్ణయంతో 3,039 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Leave a Reply