ఐదో తరగతి ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రవేశ పరీక్ష ప్రకటన ఈ నెల 18న

గురుకులాల్లో ప్రవేశ పరీక్ష ప్రకటన :

విద్యార్థులకు ఐదో తరగతి ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో ఈ నెల 18న ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన జారీ చేయనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్ వర్షిణి తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష వచ్చే సంవత్సరం 2025 ఫిబ్రవరి 23న నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

2025-26 విద్యా సంవత్సరానికి(వచ్చే సంవత్సరానికి గాను ) మే నెల 15 నాటికి ప్రవేశాలు పూర్తిచేస్తామన్నారు. పదో తరగతి పాసైన ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థు లకు సొసైటీ జూనియర్ కళాశాలల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి ప్రవేశపరీక్ష దరఖాస్తు, సొసైటీల వారీగా సీట్ల కేటాయింపు మరింత సరళీకృతం చేశామని వివరించారు. సంక్షేమ భవన్ లోని సొసైటీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వారి మాటల్లో “గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తరహా ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. సరకుల నిల్వ డబ్బాలు కొనేందుకు గురుకుల పాఠశాలకు రూ.20 వేల చొప్పున కేటాయించాం. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసు కేసులు నమోదు చేస్తాం. విద్యా ర్థులకు కొత్త మెనూ త్వరలో ప్రకటిస్తాం. రాజకీయాల కోసం గురుకుల విద్యా సంస్థలను వాడుకోవద్దని సూచి స్తున్నాం” అని తెలిపారు.

Indian Rural Girl Posing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *