PM KISAN : కేంద్రం కొత్తగా క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు.
రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా కీలక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా రైతులకు పంట సాయాన్ని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించి లక్షలాది మంది రైతులకు భారీ శుభవార్తను అందించింది. ఈ పథకం ద్వారా పంట అనంతరం రైతులకు రుణ సదుపాయాలు లభించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. గోదాముల్లో నిలువ ఉంచిన ధాన్యాలు, ఎలక్ట్రానిక్ గిడ్డంగుల రశీదుల ఆధారంగా రైతులు రుణాలు పొందడానికి వీలుగా కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,000 కోట్ల నిధులను కేటాయించింది.
ఈ పథకంలో భాగంగా వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (WDRA)ద్వారా జారీచేసే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రసీదులకు (e-NWR) రుణ సదుపాయాలు అందించడంలో బ్యాంకుల బాధ్యతను పెంచడమే మరో ముఖ్య లక్ష్యం.
ఈ పథకం ద్వారా ప్రధానంగా చేపట్టే చర్యలు:
- గిడ్డంగుల రిజిస్ట్రేషన్ల సంఖ్యను పెంచడం.
- E -కిసాన్ ఉపాజ్ నిధి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను మరితంగా అభివృద్ధి చేయడం.
- గ్యారెంటీ క్రెడిట్ గురించి రైతులకు అవగాహన కల్పించడం.
- డిపాజిటరీ ఛార్జీలను సమీక్షించడం.
ఇదిలా ఉంటే, పీఎం కిసాన్ యోజన ద్వారా 2019 నుంచి రైతులకు ఉచితంగా సంవత్సరానికి రూ. 6,000 అందిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే .
Read more: PM Kisan: రైతులకు భారీ శుభవార్త.. రూ.1000 కోట్ల నిధులతో కేంద్రం నుంచి క్రెడిట్ గ్యారెంటీ పథకం
Leave a Reply