TGPSC గ్రూప్–2 పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది .డీఎస్సీ, గ్రూప్-3 పరీక్షలు పూర్తి కావడంతో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రూప్ -2 మొత్తం 783 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. రెండు రోజులపాటు నాలుగు సెషన్లలో గ్రూప్–2 పరీక్షలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ -2 పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్బంగా టీజీపీఎస్సీ అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది :
పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవాలని టీజీపీఎస్సీ అభ్యర్థులకు కీలక సూచన చేసింది.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకూ పరీక్ష సమయం గా ఉంటుంది .
1.పరీక్షా కేంద్రానికి ఎలక్ట్రానిక్స్ పరికరాలు అనగా మొబైల్ ఫోన్స్ మరియు బ్లూ టూత్ హెడ్ సెట్ వంటివి తేవద్దని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
2.హాల్ టికెట్ డౌన్ లోడ్ సమయంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధింత అధికారులను సంప్రదించాలని పేర్కొంది.
3.డిసెంబర్ 15, 16వ తేదీల్లో రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
Leave a Reply