Telangana TET Syllabus విడుదల:
🔶26వ తేదీ నుండి హాల్ టికెట్స్ అందుబాటులోకి
🔷జనవరి 1 నుండి పరీక్షలు ప్రారంభం
🔶పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తులు.
Telangana TET 2024 : తెలంగాణ టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ ఓ కీలక సమాచారం ఇచ్చింది. టెట్ 2(2024) విద్యాశాఖ వెబ్‌సైట్ ద్వారా సిలబస్‌ను విడుదల చేసింది, సిలబస్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 26న హాల్ టికెట్లు విడుదల అవుథాయని . జనవరి 1 నుండి పరీక్షలు ప్రారంభమవుతాయి అని విద్య శాఖ పేర్కొంది .
టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 90 మార్కులు అవసరం.
బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు వస్తే టెట్ అర్హత సాధించినట్లు కీర్తించబడతారు.
టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాయడానికి అర్హులవుతారు.
గురుకులాల్లో టీజీటీ ఉద్యోగాలకు కూడా టెట్ అర్హత తప్పనిసరి.
ప్రస్తుత సంవత్సరంలో , తెలంగాణలో రెండోసారి టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 కు 94,335 అభ్యర్థులు, పేపర్ 2కు 1,81,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
🌀సిలబస్‌ను అధికారికంగా విడుదల చేసిన తర్వాత, విద్యాశాఖ మరో కీలక సమాచారాన్ని ప్రకటించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో సిలబస్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. మొత్తం 15 పేపర్లకు సంబంధించిన సిలబస్ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు https://tgtet2024.aptonline.in/ లింక్ పై క్లిక్ చేసి సిలబస్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత టెట్ సిలబస్‌తో, తాజా సిలబస్‌లో ఎటువంటి మార్పులు ఉండవు.
💥టెట్ సిలబస్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి..
💠టెట్ అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్‌సైట్ ద్వారా సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి.
ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం కేటాయించబడుతుంది.
అర్హత సాధించిన అభ్యర్థి జీవితకాలానికి సంబంధిత సర్టిఫికెట్‌తో డీఎస్సీ రాయవచ్చు.
టెట్‌లో మంచి స్కోర్ సాధించిన అభ్యర్థులకు డీఎస్సీలో మార్కులు అదనంగా జోడించబడతాయి.
రెండు ఎక్సమ్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందించి ఫలితాలు విడుదల చేస్తారు.
టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 90 మార్కులు అవసరం.
బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు వస్తే టెట్ అర్హత సాధించినట్లు కీర్తించబడతారు.
టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాయడానికి అర్హులవుతారు.
గురుకులాల్లో టీజీటీ ఉద్యోగాలకు కూడా టెట్ అర్హత తప్పనిసరి.
Leave a Reply