సరైన ఉద్యోగం లేక సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నారా అయితే ఇది మీ కోసమే : PMFME

మీరు సరైన ఉద్యోగం లేక సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నారా అయితే ఇది మీ కోసమే, PMFME దేశంలోని నిరుద్యోగులను సొంత వ్యాపారాల వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంచి పథకాన్ని ప్రారంభించింది. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈ PMFME స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. ఈ స్కీమ్ లో అప్లై చేసుకోవడానికి ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఏ అధికారుల చుట్టూ తిరగనవసరం లేదు ,ఇది పూర్తిగా ఆన్లైన్ మీరు స్వయంగా అప్లై చేసుకోవచ్చు ( https://pmfme.mofpi.gov.in/pmfme/#/Home-Page ) .

Loan amount : ఈ స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు రుణం అందిస్తోంది దీనిపై 35% సబ్సిడీ ఇస్తోంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువత ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. తక్కువ వడ్డీకే పెట్టుబడిని అందుకొని తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చు. మీరు తీసుకునే 10 లక్షల రుణంలో కేంద్ర ప్రభుత్వమే 3.5 లక్షలు% వరకు చెల్లిస్తుంది, మీరు చెల్లించాల్సింది 6.5 లక్షలు మాత్రమే ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం నిరుద్యోగ యువతకు కేంద్ర సర్కార్ ఈ లోన్స్ ఇస్తోంది ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం తీసుకొచ్చింది .

ఆహార శుద్ధి రంగంలో చిన్న మధ్య స్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ప్రారంభించింది మీ ఊరిలోనే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించవచ్చు. దీంతో పిఎం ఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు, అర్హత గల ఔత్సాహిక నిరుద్యోగ యువత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు .మీరు ఏర్పాటు చేసే యూనిట్ ఖర్చు 10 లక్షలు అయితే అందులో 90% కేంద్ర సర్కార్ బ్యాంక్స్ ద్వారా ఈ లోన్స్ ఇస్తుంది మిగిలిన 10% మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీకు 9 లక్షల లోన్ వస్తుంది ఈ లోన్ పై మీకు 35% వరకు రాయితీ లభిస్తుంది. దాదాపు 3.15 లక్షల వరకు మాఫీ అవుతుంది మీరు ఈ స్కీమ్ ద్వారా లోన్ అప్లై చేసుకునేందుకు ( https://pmfme.mofpi.gov.in/pmfme/#/Home-Page ) వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లలో రెండు రకాలు ఉంటాయి ఒకటి రెడీ టు ఈట్ అంటే తినడానికి సిద్ధంగా ఉన్నవి స్వీట్స్ స్నాక్స్ పికిల్స్ వంటివి తినడానికి సిద్ధంగా ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేసే యూనిట్స్ రెండు రెడీ టు కుక్ అంటే వండడానికి సిద్ధంగా ఉన్నవి. మసాలా దినుసులు కారపొడులు పసుపు పొడులు రెడీమేడ్ చపాతీలు డ్రెస్సింగ్ చేసిన మాంసం చేపలు మినీ రైస్ మిల్ అప్పడాలు వంటివి వండడానికి సిద్ధంగా ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేసే యూనిట్ ఇటువంటి యూనిట్స్ ను స్టార్ట్ చేయాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు, ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలోనే యూనిట్స్ నెలకొల్పబడతాయి. అలాగే వీరు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. ఏ ఆహార పదార్థం అయినా స్టోర్ చేయడానికి అణువుగా నిల్వ చేయడానికి అనువుగా ఉండేవి ప్యాకింగ్ చేసి అమ్ముతామో అన్ని రకాల ఆహార పదార్థాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కిందకి వస్తాయి.

ఈ స్కీమ్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. ఈ స్కీమ్ లో అప్లై చేసుకోవడానికి ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఏ అధికారుల చుట్టూ తిరగనవసరం లేదు, ఇది పూర్తిగా ఆన్లైన్ మీరు స్వయంగా అప్లై చేసుకోవచ్చు .ఒకవేళ ఆన్లైన్ గురించి తెలియని వారు మీ ఫ్రెండ్స్ ద్వారా గాని కస్టమర్ సర్వీస్ సెంటర్ మీ సేవ వంటి వాటి ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుండి ప్రతినిధులు మీ వద్దకు వచ్చి లేదా ఫోన్ కాల్ ద్వారా మీ యూనిట్ కు కావలసిన టెక్నికల్ ప్యాకింగ్ లైసెన్స్ లు మరియు లోన్ ప్రాసెస్ గురించి వివరిస్తారు. వారు చెప్పిన విధంగా చేస్తే మీరు పిఎం ఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా మీ ఫుడ్ యూనిట్ ను స్టార్ట్ చేయవచ్చు .ఆల్రెడీ ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నవారు అప్గ్రేడేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు ,మరిన్ని వివరాల కోసం పిఎం ఎఫ్ఎంఈ వెబ్సైట్ లో చూడండి. ఈ పథకంలో ఇప్పటివరకు మొత్తం 248375 దరఖాస్తులు వచ్చినట్లు వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది అందులో వ్యక్తులు 245628 మంది ఉండగా సంఘాలు 2425 ఉన్నాయి. వీటిల్లో దరఖాస్తులకు ఇప్పటికే రుణాలు మంజూరయ్యాయి అందులో 69859 మందికి రుణాలు పంపిణీ చేశారు మీరు వెబ్సైట్ https://pmfme.mofpi.gov.in/ లోకి వెళ్లి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *