RBI ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కొన్ని ఆంక్షలు విధించింది. ముఖ్యంగా బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల్లో నగదు లావాదేవీలు లిమిట్ దాటి ఉంటే వాటిపై భారీగా ఫైన్స్ విధించింది. నిత్యావసరాలు రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సంపాదన నుంచి కొంత ఆదాయం భవిష్యత్తు కోసం దాచుకోవడం చాలా అవసరంగా మారింది. అందుకే చాలా మంది బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ కలిగి ఉంటారు, ఈ సేవింగ్ అకౌంట్స్ ను నగదు డిపాజిట్ చేయడం విత్ డ్రా చేయడం కోసం యూస్ చేస్తుంటారు. కానీ సేవింగ్స్ అకౌంట్ అయినా, బిజినెస్ అకౌంట్ అయినా నగదు లావాదేవీలపై పరిమితులు ఉంటాయి.
ఈ పరిమితులు దాటితే బ్యాంక్ ఫైన్ వేస్తుంది మీ అకౌంట్ లో నుంచి కోతలు చేస్తుంది. అందుకే ఈ కోతలను తప్పించుకోవడానికి నిబంధనలు తెలుసుకోవాలి ఇన్కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం సేవింగ్స్ అకౌంట్ లో ఒక రోజులో లక్షకు మించి డిపాజిట్ చేయరాదు. సేవింగ్స్ అకౌంట్ లో అరుదుగా డబ్బులు డిపాజిట్ చేసే వారికి ఈ పరిమితి 250000 వరకు ఉంటుంది ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్ లో 10 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే బ్యాంకు ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇస్తుంది. కరెంట్ అకౌంట్ అయితే గనుక 50 లక్షలు బడా వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లు, కరెంట్ అకౌంట్ లో నెలకు గరిష్టంగా కోటి నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక 50000కు పైగా క్యాష్ డిపాజిట్ చేసేవారు తమ పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా తెలపాల్సి ఉంది. ఇన్కమ్ టాక్స్ చట్టం సెక్షన్ 194A (Tax deduction at source) ఈ సెక్షన్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్ నుంచి కోటి కంటే ఎక్కువ విత్ డ్రా చేసుకుంటే బ్యాంకు 2% టిడిఎస్ కోత విధిస్తుంది. అయితే మూడు సంవత్సరాలకు పైగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయని వారికి ఇంకా ఎక్కువ టిడిఎస్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది.
మూడు సంవత్సరాల నుంచి ఐటిఆర్ ఫైల్ చేయని వారు ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షలు అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకున్న 2% టిడిఎస్ చెల్లించాలి అదే ఐటిఆర్ ఫైల్ చేయని వారైతే కోటి విత్ డ్రా చేసుకుంటే అప్పుడు 5% టిడిఎస్ చెల్లించాలి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 ST ప్రకారం ఒక వ్యక్తి మరో వ్యక్తి అకౌంట్ లో ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షలకు మించి డిపాజిట్ చేయరాదు అలా చేస్తే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది అయితే ఈ పెనాల్టీ విత్ డ్రా చేసే వ్యక్తిపై ఉండదు.
Leave a Reply