PM KISAN 19th Installment దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ప్రతి ఒక్క పేద రైతుకు కూడా ₹2000 రూపాయలు అనేవి 19 విడతగా వారి బ్యాంకు ఖాతాలోకి అయితే జమ కాబోతుంది . రైతులకు ఒక సూచన కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, రైతుల యొక్క ఫోన్ గనుక స్విచ్ ఆఫ్ పెడితే పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడకపోవచ్చు. దేశంలో రైతులకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతోనే పిఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే అయితే ఈ పథకంలో భాగంగా కోట్లాది మంది రైతులైతే ఏడాదికి మొత్తంలో మూడు విడతలుగా ₹6౦౦౦ రూపాయల ఆర్థిక సహాయం అయితే వస్తున్న విషయం తెలిసిందే.
pc: Chat Gpt AI Generated
ఇందులో భాగంగానే తాజాగా రైతులకు 19వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన ఇప్పటివరకు అధికార ప్రకటన రాకపోయినప్పటికీ ఏడాది చివర్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడే అవకాశం ఉందని తెలుస్తుంధీ. ఈ పథకంలో భాగంగా DBT విధానం ద్వారా రైతుల ఖాతాల్లోకి ₹2000 అయితే అందనున్నాయి. త్వరలో 19వ విడత అకౌంట్ లోకి అయితే డబ్బులు పడనున్న నేపథ్యంలో రైతులు ఖచ్చితంగా కొన్ని కొత్త నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటుంది.
- అకౌంట్ లో డబ్బులు పడాలంటే మాత్రం ఖచ్చితంగా రైతు మొబైల్ నెంబర్ యాక్టివ్ గా అయితే ఉండాలి
- అలాగే మొబైల్ నెంబర్ కి ఆధార్ తో లింక్ అయి ఉండాలి
- ఆధార్ మరియు మొబైల్ నెంబర్ ఈ కేవైసి చేసిన వారికి మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయి
- ఈ కేవైసి చేసే సమయంలో ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ కి ఓటీపి అయితే వస్తుంది ఆ ఓటిపి ని ఎంటర్ చేస్తేనే కేవైసి ప్రక్రియ కూడా పూర్తవుతుంది.
- కాబట్టి రైతులు ఖచ్చితంగా తమ సిమ్ కార్డును యాక్టివ్ లో ఉంచుకోవాలి చెప్తున్నారు .
- ఇక నెంబర్ అప్డేట్ ఎలా చేసుకోవాలో కూడా మనకి ఈజీగానే ప్రాసెస్ ఉంటుంది. మీ దగ్గరలో ఉండే మీసేవ లేదా సిఎస్సి సెంటర్స్ దగ్గరికి వెళ్లి ఆధార్ నెంబర్ పిఎం కిసాన్ లో అప్డేట్ చేయమంటే వాళ్ళు అప్డేట్ చేస్తారు లేదా మీకు స్వంతంగా ప్రాసెస్ కావాలంటే మాత్రం మీరు మీ మొబైల్ లోనే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయితే ఉంటుంది.
- అక్కడికి వెళ్లి Update E-KYC లేదా అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా మీకు పిఎం కిసాన్ లో రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుంది ఆ రిజిస్టర్ నెంబర్ గాని ఆధార్ నెంబర్ గాని ఎంటర్ చేసి క్యాప్చా అని వస్తుంది. అక్కడ సెర్చ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఎడిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి అక్కడ మీరు మొబైల్ నెంబర్ ని అయితే మార్చుకోవచ్చు అన్నమాట ప్రస్తుతం మీ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇదండీ 19వ విడతకు సంబంధించి పిఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలోకి రావాలంటే వెంటనే చేయవలసిన పని అన్నమాట. ఇది అధికారులు చెప్తున్నారు మీ మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్ గా ఉండడం తప్పని సరి .
Leave a Reply