ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) అనే గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జూన్ 25 వ తేదీ 2015 లో ప్రారంభించింది. ఈ పథకం కింద ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకునేలా లేదా కొనుక్కునేలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇందుకు కొన్ని అర్హతలు ఉండాలి మీకు ఆ అర్హతలు ఉంటే మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాను ఈ క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి పోర్టల్ లో చూడవచ్చు.
Pradhan Mantri Awas Yojana (https://pmaymis.gov.in/)
దారిద్ర రేఖకు దిగువన ఉండి సొంత ఇల్లు నిర్మించుకోలేని వారు ఈ పథకం ద్వారా సొంత ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని అర్హతలను నిర్ణయించారు, దరఖాస్తుదారు తప్పనిసరిగా వీటిలో ఏదైనా అర్హత కలిగి ఉండాలి.
సొంత ఇల్లు లేని కుటుంబం అయి ఉండాలి
ఒకటి లేదా రెండు గదులు కచ్చా గోడలు కచ్చా పైకప్పు ఉన్న కుటుంబాలు అప్లై చేసుకోవచ్చు
పాతికేళ్ల పైబడిన అక్షరాస్లు లేని కుటుంబం అప్లై చేసుకోవచ్చు
16 నుండి 59 సంవత్సరాల వయసులో వయోజన పురుష సభ్యుడు లేని కుటుంబం అప్లై చేసుకోవచ్చు
16 నుండి 59 సంవత్సరాల మధ్య వయోజన సభ్యులు లేని కుటుంబం అప్లై చేసుకోవచ్చు
సామర్థ్యం ఉన్న సభ్యులు లేని కుటుంబాలు వికలాంగ సభ్యులు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు
భూమి లేని కుటుంబాలు సాధారణ కూలీల ద్వారా ఆదాయం పొందుతున్న వారు అప్లై చేసుకోవచ్చు
షెడ్యూల్డ్ కులాలు ,షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు మైనారిటీలు అప్లై చేసుకోవచ్చు
దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ అర్హతలను కూడా కలిగి ఉండాలి
దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి
దరఖాస్తుదారుకు శాశ్వత ఇల్లు ఉండకూడదు
దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 సంవత్సరాల వయస్సు పరిమితిని దాటి ఉండాలి
దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల నుంచి ₹6 లక్షల రూపాయల మధ్య ఉండాలి
దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డు లేదా బిపిఎల్ జాబితాలో ఉండాలి దరఖాస్తుదారుడు
ఓటర్ జాబితాలో తన పేరును కలిగి ఉండటం తప్పనిసరి అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ఈ పత్రాలను కలిగి ఉండాలి:
ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబర్
మీ ఫోటో
లబ్దిదారుని జాబ్ కార్డు లేదా జాబ్ కార్డు నెంబర్
బ్యాంకు పాస్ బుక్
స్వచ్ఛ భారత్ మిషన్ నమోదు సంఖ్య మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి
మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కోసం ఇంటి దగ్గరే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోతే మీరు ఏదైనా ప్రజా సేవ కేంద్రానికి లేదా మీ సేవా కేంద్రానికి లేదా గ్రామ అధిపతి దగ్గరకు ఇప్పుడు చెప్పిన అన్ని పత్రాలతో వెళ్ళవచ్చు. మీరు హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్ కి వెళ్లి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అది ఎలా అంటే ముందుగా మీరు ఈ క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
Pradan Manthri Awas Yojana (https://pmaymis.gov.in/)
Leave a Reply