ఏటీఎం కార్డ్ ద్వారా బీమా : Insurance on ATM CARD LATEST

ATM CARD :

జీవిత బీమా గురించి మనలో చాలామందికి తెలుసు కానీ ఏటీఎం కార్డ్ ( ATM CARD ) ద్వారా మనం బీమా కూడా పొందవచ్చును అన్న విషయం ఎంతమందికి తెలుసు. జీవిత బీమా లో వాయిదాల పద్ధతిలో మనం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా ప్రమాదం లేదా అనుకొని సంఘటన జరిగితే మన కుటుంబానికి బీమా సొమ్ము అందుతుంది. కానీ కేవలం మనం ఉపయోగిస్తున్న ఏటీఎం కార్డు ద్వారా మనము ఇన్సూరెన్స్ పొందవచ్చని మీలో ఎంతమందికి తెలుసు అందుకు మనము ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పని కూడా లేదు అదేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఈ డిజిటల్ యుగంలో చాలా వరకు నగదు లావాదేవి లు ఆన్లైన్ లోనే జరిగిపోతున్నాయి ఊర్లో చిన్న చిన్న దుకాణాల నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు డిజిటల్ నగదు లావాదేవీల కీలకంగా మారాయి.ఏటీఎం కార్డులు అందులోనూ డెబిట్ కార్డులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి భారత్లో వందల సంఖ్యలో పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులతో పాటు అంతర్జాతీయ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, వాటితో పాటు మైక్రో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా బ్యాంకింగ్ సంబంధిత లాభాదేవీలు నిర్వహిస్తున్నాయి. డెబిట్ కార్డు బీమా పథకం అంటే భారత్ లోని పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు వాటి నిబంధనలకు అనుగుణంగా వేరు వేరు స్కీములను అమలు చేస్తున్నాయి వాటిలో డెబిట్ క్రెడిట్ కార్డులు కూడా ఒకటి వీటినే ఏటీఎం కార్డులుగా వ్యవహరిస్తారు .

మిషన్ల ద్వారా నగదు తీసుకోవడం లేదా ఇతరులకు పంపించడం వంటి లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. ఈ కార్డులతో మరో ప్రయోజనం కూడా ఉంది డెబిట్ కార్డు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్ కింద బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. అందుకు నెలవారి లేదా వార్షికంగాను ప్రత్యేకంగా ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదు దానికి బదులుగా మీరు వాడుతున్న డెబిట్ కార్డులకు ఏటా చార్జీల కింద బ్యాంకు కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంది.

ఏటీఎం కార్డు అనేది బ్యాంకింగ్ రంగంలో ఒక నూతన అధ్యాయానికి దారితీసింది. ఏటీఎం కార్డ్స్ రావడం వల్ల బ్యాంకులలో క్యాష్ కౌంటర్ల వద్ద రద్దీ చాలా వరకు తగ్గింది. పేపర్ లెస్ ట్రాన్సాక్షన్స్ తో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. ఏటీఎం కార్డు అనేది మనకు మనీ ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు కల్పించడంతోపాటు 24 గంటలు డబ్బును మనం తీసుకోవచ్చు.డెబిట్ కార్డ్ వాడడం వల్ల మనం ఇన్సూరెన్స్ కూడా పొందవచ్చు మనం వాడే డెబిట్ కార్డ్ ని బట్టి మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది నిర్ణయించబడి ఉంటుంది.

చాలామంది వినియోగదారులతో పాటు కొంతమంది బ్యాంక్ సిబ్బందికి కూడా మనం ఏటీఎం కార్డు పై ఇన్సూరెన్స్ పొందవచ్చు అన్న విషయం తెలియదు ఫలితంగా బ్యాంక్ ఖాతా కలిగిన వారిలో చాలామంది ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.

డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఎలా వర్తిస్తుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకులు తమ ఖాతాదారులకు వివిధ రకాల ఏటీఎం కార్డులను మంజూరు చేస్తాయి. వాటిలో ఉదాహరణకు సిల్వర్ ,గోల్డ్, ప్లాటినం లాంటి కార్డులు ఉంటాయి, ఈ కార్డుల ఆధారంగా మీరు ఇన్సూరెన్స్ ని పొందవచ్చు. ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండవచ్చు మీరు వాడుతున్న కార్డు మరియు మీ యూసేజ్ చార్జీల ఆధారంగా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారుడు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు మరణం సంభవిస్తే ఖాతాదారుడు పై ఆధారపడిన కుటుంబానికి ఇన్సూరెన్స్ సొమ్ము పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు నిర్దిష్ట కాల పరిమితిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది (సాధారణంగా 90 రోజులు బ్యాంకును బట్టి రూల్స్ మారుతూ ఉంటాయి). కాల పరిమితి అనేది వేర్వేరు బ్యాంకులకు వేరువేరు రకంగా ఉంటుంది ప్రమాదంలో మరణించిన లేదా అంగవైకల్యం సంభవించిన ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది దీనికి మీరు మీ ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ పై గడిచిన ఆరు నెలల్లో 1 లేదా 2సార్లు ట్రాన్సాక్షన్స్ అనగా మనీ విత్డ్రాల్ చేయవలసి ఉంటుంది అప్పుడే మీకు ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ఈ బీమా సొమ్ము అనేది మీరు వాడుతున్న డెబిట్ కార్డ్ పై ఆధారపడి ఉంటుంది అది సాధారణంగా రెండు లక్షల నుండి పది లక్షల వరకు ఉంటుంది మరిన్ని వివరాల కోసం మీరు మీ బ్యాంకు యొక్క వెబ్సైట్ వెబ్సైట్ కి వెళ్లి సెర్చ్ చేయండి దాని ఆధారంగా మీరు కావాల్సిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

ఉదాహరణకు మనం SBI బ్యాంకు డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ వివరాలు చూద్దాం:

SBI డెబిట్ కార్డులపై అందుబాటులో ఉన్న ఉచిత బీమా కవర్లు

పర్సనల్ అక్సిడెంట్ ఇన్సూరెన్స్ (మరణం) నాన్-ఎయిర్: ఈ బీమా కవర్ డెబిట్ కార్డ్‌హోల్డర్‌ను నాన్-ఎయిర్ అక్సిడెంట్ కారణంగా మరణం నుండి కవరేజ్ చేస్తుంది, ఇది డెబిట్ కార్డు వేరియంట్ ఆధారంగా వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కవర్ కార్డ్‌ను కనీసం ఒకసారి ఏదైనా చానల్‌లో (ATM/పాయింట్ ఆఫ్ సేల్/ఈ-కామర్స్) వినియోగించిన తర్వాత మాత్రమే చెలామణీ అవుతుంది, మరియు ఈ ప్రయాణం యొక్క తేది నుంచి గత 90 రోజుల్లో (ఆర్థిక లావాదేవీ) ఈ షరతును పాటించాలి.

పర్సనల్ ఎయిర్ అక్సిడెంట్ ఇన్సూరెన్స్ (మరణం): ఈ బీమా కవర్ డెబిట్ కార్డ్‌హోల్డర్‌ను ఎయిర్ అక్సిడెంట్ కారణంగా మరణం నుండి కవరేజ్ చేస్తుంది, ఇది డెబిట్ కార్డు వేరియంట్ ఆధారంగా వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కవర్ కార్డ్‌ను కనీసం ఒకసారి ఏదైనా చానల్‌లో (ATM/పాయింట్ ఆఫ్ సేల్/ఈ-కామర్స్) వినియోగించిన తర్వాత మాత్రమే చెలామణీ అవుతుంది, మరియు ఈ షరతు ఉన్నప్పుడు, ఎయిర్ టికెట్ ఆ ప్రయాణం కోసం డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేయబడాలి.

పర్సనల్ అక్సిడెంట్ ఇన్సూరెన్స్ (ఎయిర్ & నాన్-ఎయిర్) వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

PC: SBI

https://sbi.co.in/web/personal-banking/cards/debit-card/insurance-covers-available: ఏటీఎం కార్డ్ ద్వారా బీమా : Insurance on ATM CARD LATEST

మరిన్ని వివరకాలు మీ బ్యాంకు వెబ్ సైట్ ని సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *