e-Shram Card: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం e- shram యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.ప్రభుత్వం eShram పోర్టల్ ని కూడా ప్రారంభించింది. Eshram portal యొక్క ముఖ్య ఉద్దేశ్యం అసంఘటిత రంగం లో పని చేస్తున్న కార్మికుల వివరాలు సేకరించి ప్రభుత్వ పథకాలను అందించడం.
ఎవరైతే అసంఘటిత రంగం లో పని చేస్తున్న కార్మికులు ఉన్నారో వారు eshram card కు అప్లై చేసుకోవచ్చు. వారికి వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు పెన్షన్ 60 సంవత్సరాల తర్వాత లేదా అకస్మాత్తుగా మరణం సంభవిస్తే 2లక్షల రూపాయాల ఇన్సూరెన్స్ లేదా దీర్ఘకాలిక అంగవైకల్యం సంభవిస్తే 1 లక్ష వరకు ప్రయోజనం చేకూరుతుంది.
అసంఘటిత రంగం అంటే ఏమిటి?
అసంఘటిత రంగం అంటే ఏదైనా చిన్న పనులు, లేదా కన్స్ట్రక్షన్ పని చేస్తున్న కార్మికులు, లేబర్, రోజువారి కూలీలు, పెయింటర్స్, ఏదైనా కార్మికుడు ESIC లేదా EPFO లో మెంబర్ షిప్ లేనివారు.
eShram Card Eligibility:
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు వయసు 16 నుండి 59 మధ్యలో ఉండాలి.
ఇండియన్ నేషనల్ అయి ఉండాలి.
మొబైల్ ఫోన్ ని ఆధార్ కార్డ్ తో జత చేసి ఉండాలి.
Income tax pay చేస్తు ఉండకూడదు.
eShram Benefits:
ఇ-శ్రామ్ కార్డ్ కలిగి ఉన్న అసంఘటిత కార్మికుడు క్రింది ప్రయోజనాలను పొందుతారు:
60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్.
రూ.2,00,000 మరణ బీమా మరియు కార్మికుని పాక్షిక వైకల్యం విషయంలో రూ.1,00,000 ఆర్థిక సహాయం.
ఒక లబ్దిదారుడు (ఈ-శ్రామ్ కార్డ్ కలిగి ఉన్న అసంఘటిత రంగంలోని కార్మికుడు) ప్రమాదం కారణంగా మరణిస్తే, జీవిత భాగస్వామికి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
లబ్ధిదారులు భారతదేశం అంతటా చెల్లుబాటు అయ్యే 12-అంకెల UAN నంబర్‌ను అందుకుంటారు.
How to Apply:
https://eshram.gov.in/ website కు వెళ్లి మీ వివరాలు నమోదు చేయండి మీకు వెంటనే కార్డు వస్తుంది .
Leave a Reply