ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పి యం జి కే ఏ వై)
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో ప్రచురించారు మరింత సమాచారం కోసం మీరు ఆ వెబ్సైట్ను సందర్శించండి
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం వివిధ రకాల పథకాలను అమలు చేస్తుంది ముఖ్యంగా మధ్యతరగతి మరియు బీద వారి కోసం ఈ పథకాలను అమలు చేస్తుంది. దీని ద్వారా దేశంలో కోట్లాదిమంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత రేషన్ పథకం ప్రధానమంత్రి కెరీర్ కళ్యాణ్ అన్న యోజన. దీని ద్వారా ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకూడదని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం.
CORONA మహమ్మారి వంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ఇప్పుడు ఈ పథకాన్ని ఇంకో ఐదేళ్లపాటు పొడిగిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత రేషన్ పథకం మరో ఐదు సంవత్సరాలు పొడిగింపు:
ఈ పథకం ద్వారా పేద ప్రజలకు మధ్యతరగతి వారికి ఐదు కిలోల వరకు ఉచితంగా రేషన్ అందజేస్తారు. ఈ పథకాన్ని జనవరి 1 2024 నుండి మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది దీనివల్ల దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు.
అర్హత
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద లబ్ధి పొందడానికి భారత ప్రభుత్వం కొన్ని అర్హతలను నిర్ణయించింది
భూమిలేని వ్యవసాయ కార్మికులు
సన్నకారు రైతులు
కుమ్మరులు
చేనేత కార్మికులు
కమ్మరి
వడ్రంగి
మురికివాడాలవాసులు
శ్రమజీవులు
కూలీలు
రిక్షా వర్కర్లు
ఆటో డ్రైవర్లు
రోజువారి జీవనోపాధి పొందేవారు
శ్రామికులు
చేతివృత్తుల వారు
పండ్లు పూలు, కూరగాయలు అమ్మేవారు
ముఖ్యంగా చెప్పాలంటే నిరుపేదలకు ఈ పథకం ప్రయోజనం కల్పించడం ఉంది.
దీంతోపాటు వితంతువులు లేదా తీవ్ర అనారోగ్యంతో కుటుంబ పెద్దలు బాధపడుతున్న ఈ పథకం వర్తిస్తుంది.
Leave a Reply