PM Vishwakarma yojana : 40 పైసల వడ్డీకే మూడు లక్షల ( 300000)రూపాయల రుణం ఉచిత శిక్షణతో పాటు.
కులవృత్తులకు మోడీ ప్రభుత్వ వరం.
ముఖ్యాంశాలు:
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన 2024
40 పైసల వడ్డీకి 3 లక్షల రూపాయల వరకు లోన్
ఉచిత నైపుణ్య శిక్షణ ,శిక్షణకు గాను ప్రతిరోజు 500 రూపాయల స్టయిఫండ్
పదిహేను వేల రూపాయల విలువగల E Tool Kit (ఈ – టూల్ కిట్) ఉదాహరణకు కుట్టుమిషన్
What is Pm Vishwakarma Yojana:
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించబడిన పథకం. ఈ పథకం ముఖ్యంగా వృత్తి నైపుణ్యాలకు పెద్దపీట వేస్తూ స్వయం ఉపాధిని పెంపొందించే దిశగా రూపొందించబడింది. ఈ పథకాన్ని 17 సెప్టెంబర్ 2023లో కేంద్ర ప్రభుత్వం చే ప్రారంభించబడింది. ఈ పథకానికి 15 వేల కోట్ల నిధులు మంజూరు చేశారు, ఈ పథకాన్ని 2028 వరకు అప్లై చేసుకోవచ్చు
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు అర్హత ( Eligibility for PM Vishwakarma yojana ):
వడ్రంగి.
పడవలు తయారు చేయువారు.
కమ్మరి .
స్వర్ణకారులు.
కుమ్మరి .
చెప్పులు పని చేసేవాళ్లు.
తాపీ పని చేసేవాళ్లు.
కుట్టుమిషన్ టైలరింగ్ చేసేవాళ్ళు.
బొమ్మలు తయారుచేవారు.
Bags తయారుచేయవారు .
వెదురు కర్రలు తయారు చేయువారు.
కొయ్య బొమ్మలు చేయువారు .
బుట్ట, చాప, చీపుర్లు తయారు చేయువారు.
కొయ్య బొమ్మలు చేయువారు.
మంగలి వారు
పూలదండలు చేయవారు
చాకలి వారు
చేప వలలు చేయువారు
లెదర్ బ్యాగ్స్ తయారుచేయువారు
కావలసిన డాక్యుమెంట్స్:
ఆధార్ కార్డ్ కుటుంబ సభ్యులతో సహా,
చిరునామా రేషన్ కార్డ్.
ఫోన్ నెంబర్.
క్యాస్ట్ సర్టిఫికెట్.
బ్యాంక్ పాస్ బుక్.
18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
ఫోన్ నెంబర్ బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి ఉండాలి.
ఎవరికి వర్తించదు?
ఐ టి ఆర్ ఫైల్ (Income Tax Return) చేసేవాళ్ళు.
ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఈ పథకం వర్తించదు.
ముద్ర (MUDRA Loan) లోన్ లేదా (PMEGP Loan) తీసుకొని ఉండటం వల్ల లేదా ప్రభుత్వ ఉద్యోగులు మీ కుటుంబంలో ఉండడం వల్ల మీకు ఈ పథకం వర్తించకపోవచ్చు.
How to Apply:
ఈ పథకాన్ని మీసేవకు వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీ సేవ వాళ్ళు దగ్గరలో ఉన్న బ్యాంకు ని సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత మీ అప్లికేషన్ ఊర్లో ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్తుంది. వాళ్ళు అన్ని వివరాలు సరిచూసుకొని అప్రూవల్ ఇస్తారు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పీఎం విశ్వకర్మ యోజన హెడ్ ఆఫీస్ కి వెళ్తుంది. ఆ తర్వాత మీకు సర్టిఫికెట్ మరియు ఐడి కార్డ్ వస్తుంది కొన్నిసార్లు మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది దీనికి కారణం మీరు ఐటిఆర్ ఫైల్ చేసి ఉండాలి లేదా ముద్ర లోన్ లేదా పీఎం ఈజిపి లోన్ తీసుకొని ఉండటం వల్ల లేదా ప్రభుత్వ ఉద్యోగులు మీ కుటుంబంలో ఉండడం వల్ల మీకు ఈ పథకం వర్తించకపోవచ్చు.
ప్రతి మండలంలో విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో రెండు రకాల ట్రైనింగ్స్ ఉంటాయి ఒకటి నార్మల్ ట్రైనింగ్, రెండోది అడ్వాన్స్ ట్రైనింగ్ నార్మల్ ట్రైనింగ్ లో భాగంగా ఐదు రోజుల వరకు ట్రైనింగ్ పొందవచ్చు, అందుకుగాను మీరు ప్రతిరోజు 500 రూపాయలు స్టైపండ్ పొందుతారు.
Advance ట్రైనింగ్ time period 15 Days డైలీ 500 రూపాయల స్టైపాండ్
ఆ తర్వాత Toolkit E CARD లభిస్తుంది
Leave a Reply