పిఎం కిసాన్ సమ్మన్ నిధి: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం కిసాన్ యోజన ను అప్లై చేసుకోవడానికి అర్హతలు మరియు దరఖాస్తు విధానం తెలుసుకుందాం.
పిఎం కిసాన్ సమ్మన్ నిధి: PM KISAN SAMMAN NIDHI SCHEME
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమన్ నిధి ని తీసుకొని వచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరానికి 6000 రూపాయలు లభిస్తాయి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి విడుదలవారీగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి
ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది:
చిన్న మరియు సన్న గారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా 6000 రూపాయలు సంవత్సరానికి అందిస్తారు.
ఈ పథకంలో ఎలా చేరాలి:
పీఎం కిసాన్లో చేరాలంటే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ ఫార్మర్ కార్నర్స్ ని క్లిక్ చేసి అందులో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ని ఎంచుకొని మీ వివరాలు అందజేయాల్సి ఉంటుంది లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా మీరు మీ అప్లికేషన్ ని సమర్పించవచ్చు
ఈ పథకం పూర్తిగా రైతుల కోసం ఉద్దేశించబడిన పథకం ఇతర వృత్తులలో ఉంటూ Agriculture Land కలిగి ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. ఆదాయపన్ను చెల్లించే వారు కూడా ఈ పథకం కు అర్హులు కాదు. ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతాలలో తప్పులు లేకుండా ఒకే విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
అర్హత :
ఈ పథకంలో చేరేందుకు రైతులు భారతీయ పౌరులు అయ్యి ఉండాలి
చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైనా సరే ఈ పథకంలో చేరవచ్చు
గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లోని రైతులందరూ ఈ పథకంలో చేరేందుకు అర్హులు
ఈ పథకంలో చేరడానికి కింది డాక్యుమెంట్లు అవసరం:
ఆధార్ కార్డ్ , బ్యాంక్ అకౌంట్
పొలం పట్టా పాస్ బుక్
రిజిస్టర్ మొబైల్ నెంబర
ఈ పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు:
పీఎం కిసాన్ సామాన్ నిధి పథకం ద్వారా అందే డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా రైతు ఖాతాలోకి చేరుతాయి. 100% డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాల కి సంబంధం లేదు
ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు 2000 చొప్పున మొత్తంగా 6000 రూపాయలు లభిస్తాయి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి. పిఎం కిసాన్ కు అర్హులు ఎవరినైనా విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సి ఉంటుంది రైతులకు బ్యాంక్ ఖాతా అవసరం తప్పనిసరిగా ఉంటుంది
Leave a Reply