తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కొత్త ఆర్ ఓ ఆర్ (ROR) బిల్లును ప్రవేశపెట్టింది. గతంలో అమలులో ఉన్న ధరణి విధానాన్ని రద్దు చేస్తూ, ప్రజల భూ హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా రూపొందించిన “భూభారతి” అనే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
PC: GOOGLE
ఈ కొత్త చట్టం ప్రధాన లక్ష్యం ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, భూ హక్కులకు శాశ్వత రక్షణ కల్పించడం. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ధరణి విధానంలో జరిగిన అనేక భూదందాలను వెలుగులోకి తీసుకురావడం కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంది.
కొత్త ఆర్ ఓ ఆర్ బిల్లులోని ముఖ్యాంశాలు:
- భూ వివాదాల పరిష్కారం: సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించటం.
- మ్యూటేషన్ సిస్టమ్:
- మ్యూటేషన్ తప్పులను సవరించేందుకు అఫిలియేట్ సిస్టమ్ ఏర్పాటు.
- మ్యూటేషన్ పవర్స్‌ను ఆర్డిఓకు కేటాయింపు.
- సాదా బైనామా దరఖాస్తులు: వీటికి పరిష్కారం చూపడం.
- గ్రామ భూముల సమస్యలు: వీటికి శాశ్వత పరిష్కార మార్గాలు అందించడం.
- రెవెన్యూ రికార్డుల నిర్వహణ:
- ఆన్లైన్ రికార్డులతో పాటు మాన్యువల్ రికార్డులను కూడా మెయింటైన్ చేయడం.
- 2014కు ముందు విధానాలను తిరిగి ప్రవేశపెట్టడం.
- పట్టాదారు అనుభవదారుల హక్కులు: వీరికి ఇబ్బంది లేకుండా చూడడం.
- ధరణి విధానంపై లోపాలను సరిదిద్దడం:
- ధరణి కారణంగా అన్యాయక్రాంతమైన భూముల లెక్కలు తేల్చడం.
- పార్ట్ Bలో ఉన్న పద్ధతిని మెరుగుపరచి లక్షల ఎకరాలకు పరిష్కారం చూపడం.
- సర్వే నెంబర్ ద్వారా భూ వివరాలు: సులభంగా తెలుసుకునే విధానానికి మార్గం సుగమం చేయడం.
ఈ కొత్త చట్టాన్ని రూపకల్పన చేయడానికి 18 రాష్ట్రాల ఆర్ ఓ ఆర్ చట్టాలను అధ్యయనం చేసి, నిపుణుల సూచనల ఆధారంగా రూపొందించారు. రైతులు, భూయజమానులు ఎదుర్కొనే అసలు సమస్యలను పరిష్కరించేందుకు ఇది ఒక మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు.
Leave a Reply