ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొబైల్ యాప్ సిద్ధమైంది. ఈ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంచనంగా ప్రారంభించనున్నారు, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక జరగనుంది. ప్రతి మండల కేంద్రంలోనూ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించనున్నారు, మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే మొబైల్ యాప్ ను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ను రూపొందించింది. ఇదివరకే మహబూబ్ నగర్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మెదక్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుం.ది ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించి యాప్ లో నమోదు చేస్తారు దరఖాస్తు దారుని పేరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆర్థిక పరిస్థితి ఇల్లు నిర్మించనున్న స్థలం ఇతర వివరాలకు సంబంధించిన సుమారు 35 ప్రశ్నలు ఉంటాయి ఆ వివరాల ఆధారంగా అర్హుల్ని విడతల వారీగా గ్రామసభల ద్వారా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేయనున్నాయి.
లబ్దిదారుల ఎంపికలు దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాధలు, వితంతువులు ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మాచారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించనున్నారు. మొదటి విడతలో సుమారు 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా నిధులు సేకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులు రాబట్టారని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్దిదారుల ఎంపిక ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసం ఇప్పటికే ఇందిరమ్మ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామాల్లో పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. పంచాయతీల్లో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి మున్సిపల్ వార్డులో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్లను కమిటీ చైర్ పర్సన్లుగా నియమించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తయ్యే వరకు ఇందిరమ్మ కమిటీలే లబ్దిదారులకు సమన్వయం చేస్తాయి. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం నాలుగు విడతల్లో ₹5 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత స్థలం లేని నిరుపేదలకు పథకం వర్తింప చేయనున్నారు. ఇందిరమ్మ పథకంలో నిర్మించే ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు ఉండాలని అందులో హాల్ బెడ్ రూమ్ వంటగది బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాల్లో ప్రకటించారు. అవసరమైతే లబ్దిదారులు అదనపు గదులు నిర్మించుకోవచ్చని తెలిపారు అర్హులకు ఇల్లు దక్కకపోయినా అనర్హులు లబ్ది పొందిన ఇందిరమ్మ కమిటీలు ఎంపిడిఓ మున్సిపల్ కమిషనర్ కు తెలియజేయాలని జీవో లో పేర్కొన్నారు.
Leave a Reply