Telangana Govt New Update: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్దిదారులను గుర్తించేందుకు డిసెంబర్ 6వ తేదీన ప్రక్రియ చేపట్టినట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. ఇందుకోసం ఇందిరమ్మ ఇండ్ల యాప్ ని కూడా డెవలప్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇంద్రమ్మ ఇళ్ల యాప్ ద్వారానే అర్హులైన వారిని గుర్తించనున్నారు. పైలట్ ప్రాజెక్టు గా మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో లబ్దిదారు డేటాను నమోదు చేసి సక్సెస్ఫుల్ గా అర్హులైన వాళ్ళని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఇంద్రమ్మ కమిటీలను నియమించి వారిని ఈ ఇంద్రమ్మ ఇళ్ల యాప్ ద్వారా ఇంటింటి సర్వే చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు డెవలప్ చేసిన యాప్ తో పాటు మూడు రకాల ఇంటి ప్లాన్లను కూడా ప్రభుత్వం రూపొందించింది. తక్కువ స్థలంలోనే రెండు రూములు ఒక కిచెన్ అండ్ ఒక బాత్రూమ్ ఉండేలా ఇంజనీర్లు ఈ ప్లాన్ ని తయారు చేసినట్లు మంత్రి తెలిపారు.
అయితే ఇంటి నిర్మాణానికి మినిమమ్ 400 చదరపు అడుగుల స్థలం ఉండాలి, ఇంజనీర్లు ఇచ్చిన ప్లాన్ ప్రకారం 400 స్క్వేర్ ఫీట్ తో ప్రతి మండలంలో ఒక ఇంటిని నిర్మించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా ఇల్లు ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రభుత్వం అందించే ₹5 లక్షల రూపాయలతో ఇంటిని ఎలా నిర్మించుకోవాలో పబ్లిక్ కి ఈజీగా అర్థమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఖచ్చితంగా ఇంటిని ఇలానే నిర్మించుకోవాలనేది మాత్రం ఏమీ లేదు ఎవరికి నచ్చినట్టు వారు ఇంటి నిర్మాణాన్ని చేసుకోవచ్చని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. అయితే పేదలు ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల డబ్బుతోనే ఇల్లు నిర్మించేందుకు ఈ నమూనా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. 400 చదరపు అడుగుల కంటే అధికంగా స్థలం ఉన్నవారు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలతో పాటు వారు అదనంగా కూడా ఖర్చు చేసి తమకు నచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో సొంత ఇల్లు కావాలని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో రేషన్ కార్డు తో మ్యాచ్ అయినవి గుర్తించి వాటిలో గతంలో ఇండ్ల లబ్ది పొందిన వారిని తొలగించి మిగతా వాటిలో రేషన్ కార్డు కలిగి ఉండి ఇదివరకు ఎటువంటి ఇల్లు తీసుకొని 41 లక్షల కుటుంబాలను గుర్తించినట్లు అధికారం అధికారులు తెలిపారు.
ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూస్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. లబ్దిదారుల గుర్తింపులో భాగంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఇంటికి సర్వే చేసేవారు వెళ్లి అందులో ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి వివరాలు ఇల్లు నిర్మించుకోవడానికి లబ్దిదారుల దగ్గర భూమి ఉందా లేదా ఒకవేళ స్థలం ఉంటే లబ్దిదారుడు పేరు మీద ఉందా లేదా కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా మరియు ఆ కుటుంబంలో పెళ్లైన జంటలు ఎంతమంది ఉన్నారు. అలాగే ప్రస్తుతం వారు ఉంటున్న ప్లేస్ లో ఎన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు అనే వివరాలు యాప్ లో నమోదు చేస్తున్నారు.
ఈ సర్వేను గెజిటెడ్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు విలేజ్ లో పంచాయతీ కార్యదర్శి మున్సిపల్లో వార్డ్ అధికారి ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అనర్హులకి ఇల్లు మంజూరు కాకుండా ఎంపిడిఓ లు కమిషనర్లు కూడా ఈ సర్వేని పర్యవేక్షిస్తారు. సర్వే సమయంలో యాప్ లో లబ్దిదారుని ఫోటో తీసుకుంటారు అలాగే ఇంటిని నిర్మించే స్థలాన్ని కూడా google మ్యాప్ ఆధారంగా లొకేషన్ క్యాప్చర్ చేస్తారు.
ఇంటి నిర్మాణ సమయంలో కూడా ఈ యాప్ లో ఏఐ ఆధారంగా ఫోటోలు తీస్తారు, లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు నిర్మించినందుకు ఐదు లక్షల రూపాయల సహాయాన్ని ఆధార్ కి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారుల వివరాలకు 360° లో అధికారులు పరిశీలించనున్నారు ఎవరైనా అనర్హులు ఎంపికైతే వారిని సులువుగా ఈ మార్గం ద్వారా గుర్తించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందులో త్రీ వీలర్స్ లేదా ఫోర్ వీలర్స్ కలిగి ఉన్న కుటుంబాలను వ్యవసాయానికి ఉపయోగించే హార్వెస్టర్ లాంటి పరికరాలు గవర్నమెంట్ జాబ్ ఇన్కమ్ టాక్స్ పేయర్స్ అండ్ ఇదివరకు ఇతర పథకాల ద్వారా ఇల్లు పొందిన కుటుంబాలను ఈ 360° ప్రక్రియ ద్వారా గుర్తించి వారిని అర్హుల డేటాబేస్ నుంచి తొలగించనున్నారు.
ఇదివరకు చెప్పినట్టుగానే ఇంద్రమ్మ ఇళ్ల మొదటి విడతలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మొత్తం నాలుగున్నర లక్షల అందించనున్నారు.
Leave a Reply