మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకానికి ఎన్డీయే ప్రభుత్వం తీపికబురు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (MGNREGA) కూలీలకు ఎన్డీయే ప్రభుత్వం సంతోషకరమైన వార్తను అందించింది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు కూలీల కనీస దినసరి వేతనాన్ని ₹263 నుండి ₹300 కు పెంచేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
ఈ విభాగం బోగస్ మాస్టర్లను అరికట్టి, పని వేళల్లో మార్పులు చేసి కూలీలకు గిట్టుబాటు వేతనాలు అందేలా పర్యవేక్షించనుంది. జిల్లా విజిలెన్స్ అధికారిను నియమించడం ద్వారా జిల్లాస్థాయిలో పర్యవేక్షణ బలపర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
పని వేళలు మరియు వేతనాల్లో మార్పులు
ప్రస్తుతం MGNREGA కూలీలు రోజుకు 4 గంటలపాటు పని చేస్తున్నారు. కూలీల ఆదాయాన్ని పెంచేందుకు పని సమయాన్ని 5 గంటల వరకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఫీల్డ్ అసిస్టెంట్లు, APDs, APOs, MPDOలతో మస్టర్లను తరచూ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అంచనా ప్రకారం, ఈ మార్పులతో కూలీలకు సగటున ₹300 వేతనం లభిస్తుంది.
జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన వేతన పర్యవేక్షణ విభాగం పనుల కాలపరిమితి, ఉత్పాదకత తదితర అంశాలను పర్యవేక్షించి, కూలీలకు న్యాయమైన వేతనాలు అందేలా చూడనుంది.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని వేళలు
జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ రోజుకు ₹300 వేతనం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పని వేళలను లక్ష్యానికి అనుగుణంగా పొడిగించాలి. ప్రస్తుతం 4 గంటలపాటు పని చేసే కూలీలు, 5 గంటలపాటు పని చేస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. వేతన పెంపు గురించి అవగాహన కల్పించేందుకు సిబ్బందిని సూచించారు.
సత్తెనపల్లి మరియు పెదకూరపాడు నియోజకవర్గాల్లో 1,73,549 కూలీలు నమోదు కాగా, 99,324 కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు.
వేతన పెంపు కోసం నిబంధనలు
వేతన పెంపును అమలు చేయడానికి ప్రభుత్వం ఈ నిబంధనలను విధించింది:
- పని ప్రదేశాన్ని గుర్తించి, అనువుగా పనులను కేటాయించాలి.
- ముందుగానే అంచనాలు తయారు చేయాలి.
- నేల స్వభావం, పని అనుకూలతను పరిగణలోకి తీసుకోవాలి.
- జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని పనులు కల్పించాలి.
- పని వేళలను అవసరానికి అనుగుణంగా సవరించాలి.
- సాంకేతిక సహాయకుల ద్వారా రోజువారీ పర్యవేక్షణ చేయాలి.
- APD, APO, MPDOలు మస్టర్లను తనిఖీ చేయాలి.
- పని వేళలు, కొలతలు పారదర్శకంగా నమోదు చేయాలి.
- కూలీలకు వేతన రసీదులు నిరభ్యంతరంగా అందించాలి.
బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట
ఉపాధి పనుల్లో బోగస్ మస్టర్ల మాయజాలం ప్రధాన సమస్యగా ఉంది. పనికి రాని కూలీల పేరుతో హాజరును నమోదు చేసి, కొందరు సిబ్బంది వేతనాలను దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో నిజంగా పనికి హాజరైన కూలీలకు పూర్తిగా వేతనాలు అందటం లేదు.
ఈ అక్రమాలను అరికట్టేందుకు జిల్లా విజిలెన్స్ అధికారి నియమించి పర్యవేక్షణ బలపరుస్తున్నారు.
ఈ చర్యల ద్వారా ప్రభుత్వం పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు, కూలీలకు మెరుగైన పని పరిస్థితులు, న్యాయమైన వేతనాలు అందేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Leave a Reply