తెలంగాణ రెవెన్యూ శాఖలో జేఆర్వో పోస్టులకు త్వరలో నోటిఫికేషన్! New 5300 JRO Jobs in Telangana

Telangana JRO ( Junior Revenue Officer Posts ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి చర్యలు ప్రారంభించింది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి, జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్వో) పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

తెలంగాణలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ఈ నియామకంలో, గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసి ఇతర శాఖలకు బదిలీ అయిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూపరిపాలన కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రాధాన్యత:
గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దు సమయంలో ఆ పోస్టుల్లో పనిచేసినవారికి, వీఆర్‌ఏలుగా పనిచేస్తూ ఇతర శాఖలకు బదిలీ అయిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకునే అవకాశముంది.

అర్హతలు & భర్తీ విధానం:

  • రాష్ట్రవ్యాప్తంగా 3,600 మంది మాజీ వీఆర్వోలు, 2,000 మంది వీఆర్‌ఏలు ఈ నియామకానికి అర్హులని అంచనా.
  • మిగతా సుమారు 5,300 పోస్టులను భర్తీ చేయడం కోసం ఇతర ఆప్షన్లపై ప్రభుత్వం ఆలోచిస్తోంది.
  • ఇంటర్‌ పూర్తిచేసినవారిలో గణితశాస్త్రం చదివినవారిని నేరుగా సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది.

రాత పరీక్ష ద్వారా భర్తీ:
మిగిలిన జేఆర్వో మరియు సర్వేయర్‌ పోస్టులను రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే, ఈ నియామకాల్లోకి మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏలు సుముఖత వ్యక్తం చేస్తే వారికి ప్రాధాన్యం ఉంటుంది.

VRO JOBS IN Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *