PAN CARD 2.0 UPDATE డిజిటలైజెషన్

PAN CARD 2.0 UPDATE: పాన్‌కార్డ్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) అనేది భారత ప్రభుత్వంతో జతచేసిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది ఆదాయపు పన్ను విషయాలు, ఆర్థిక లావాదేవీల కోసం అవసరమవుతుంది. పాన్‌కార్డ్ వ్యక్తిగత వివరాలతో జతచేసి, పన్ను సంబంధిత విధానాలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. ఈ నంబర్ 10 అంకెలతో ఉంటుంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

PC: GOOGLE

పాన్ కార్డులను తొలిసారిగా 1970 లో అమలోకి తీసుకువచ్చారు, యూనిఫైడ్ నెంబర్ సిస్టం అప్పుడు ప్రవేశపెట్టారు. అప్పటి అవసరాలకు అందుబాటులో ఉండే డిజిటల్
పరిజ్ఞానాన్ని మాత్రమే అందులో వినియోగించారు.పాన్ కార్డు డిజిటలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది QR కోడ్ ద్వారా పాన్ కార్డును యాక్సెస్ చేసేలా మార్పులు తీసుకొస్తుంది. దీనివల్ల పాన్ యాక్సెస్ మరింత సులభతరం కావడమే కాకుండా డేటా సెక్యూరిటీ కూడా మరింత పటిష్టంగా మారనుంది. పాన్ కార్డు లో పేపర్ లెస్ సిస్టం తో పాటు ఆన్ టైం డేటాను పొందడానికి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది అని ఇటీవల జరిగిన కేంద్ర కాబినెట్ మీటింగ్ లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.. ఇందుకోసం ఇప్పటికే 1435 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

పాన్ 2.0 ప్రాజెక్ట్ తో తీసుకురాబోతున్న కీలక మార్పుల గురించి తెలుసుకుందాం:
దేశంలో ప్రస్తుతం 98% మందికి వ్యక్తిగత పాన్ కార్డులు ఉన్నాయి అంటే 78 కోట్ల మందికి ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డులు జారీ చేసింది. పాన్ కార్డులో మార్పుల కారణంగా ఇప్పటివరకు అమలులో ఉన్న కార్డులన్నిటిని రెన్యూవల్ చేసి కొత్తవి జారీ చేయాల్సి ఉంటుంది. ఇది టెక్నాలజీ సహాయంతో ఎఫిషియన్సీని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా కొత్త పాన్ కార్డులో QR CODE సిస్టం ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మరింత సమాచారాన్ని కార్డులో నిక్షిప్తం చేయవచ్చు. పాన్ 2.0 నిర్దిష్ట రంగాలని వ్యాపారాలకు ఒకే ఐడెంటిఫైర్ గా పనిచేస్తుంది ,పరిపాలన పరమైన పనులను సులభతరం చేస్తుంది. ఇప్పటివరకు ప్రజలకు కంపెనీలకు వేరు వేరు ప్లాట్ఫార్మ్లు అందుబాటులో ఉన్నాయి దీని ద్వారా ఒకే వ్యక్తి పాన్ కార్డు(PAN CARD) ,టాన్ కార్డు(TAN CARD) తో పాటు టిన్ కార్డు(TIN CARD) ను సెపరేట్ గా కలిగి ఉండాలి దీంతో కొన్ని సమస్యలు ఏర్పడేవి అందుకే ఈ మూడింటిని మెర్జ్ చేయాలని కేంద్రం భావించింది ఈ మూడింటిని ఏకం చేసి అందరికీ ఒకే ప్లాట్ఫార్మ్ ను రూపొందించడం ద్వారా సమాచారాన్ని మరింత ఈజీగా యాక్సెస్ చేసేందుకు వీలు కలుగుతుంది.దీని ద్వారా అన్ని పాన్ రిలేటెడ్ సేవలను పొందవచ్చు.

ఈ డిజిటలైజ్డ్ పాన్ కార్డు లో యూసర్ డేటాను రక్షించడానికి ప్రైవేసీని కాపాడడానికి మెరుగైన పద్ధతులు అమలులో ఉంటాయి. 1970 ల కాలం నాటి సర్వర్లు సెక్యూరిటీ సిస్టం ఉండడంతో డేటా దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుంది ప్రజలకు సంబంధించిన సమాచారం ఎక్కువగా లీక్ అవుతుంది దీంతో వీటిని పూర్తిగా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది ఇకపై పాన్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి డేటాను సెక్యూర్ సిస్టంలలో స్టోర్ చేయాల్సి ఉంటుంది. పాన్ 2.0 వినియోగదారులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో అంతరాలు లేని సేవలు అందుతాయి వ్యక్తులు వ్యాపార సంస్థలకు FAST TRADES , పేపర్ లెస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వ్యాపార సంస్థలు వివిధ ప్రభుత్వ ప్లాట్ఫార్మ్ లలో ఒకే ఐడెంటిఫైర్ ను ఉపయోగించవచ్చు అప్డేట్ చేసిన ప్రాసెస్ లతో నమ్మకం పారదర్శకతను మెరుగుపడతాయి.

మోదీ కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి భారత్ డిజిటలైజేషన్ వైపుకు వేగంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే యూపిఐ పేరిట నగదు చెల్లింపులో డిజిటల్ విప్లవం సృష్టించింది భారత్ అమెరికా చైనా వంటి అగ్ర దేశాల్లోనే ఇంకా ప్రత్యక్ష నగదు చెల్లింపులు జరుగుతున్నాయి కానీ భారత్ లో అలా కాదు దాదాపు అన్ని చోట్ల డిజిటల్ చెల్లింపులు అంగీకరిస్తున్నారు చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు యూపిఐ పేమెంట్లను అంగీకరిస్తున్నారు చివరకు యాచకులు కూడా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారంటే భారత్ ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.

FAQ’S:

PAN 2.0 ప్రాజెక్టు పై తరచూ అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న 1: PAN 2.0 అంటే ఏమిటి?

PAN 2.0 ప్రాజెక్టు అనేది ITD యొక్క e-Governance ప్రాజెక్ట్, ఇది పన్నుదారుల నమోదు సేవల వ్యాపార ప్రక్రియలను పునర్నిర్మించేందుకు రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం తాజా సాంకేతికతను అవలంబించి PAN సేవల నాణ్యతను మెరుగుపరచడమే. ఈ ప్రాజెక్టు ద్వారా ITD అన్ని PAN కేటాయింపు/అప్డేషన్/సరిచేయడం మరియు TAN సంబంధిత సేవలను ఏకీకృతం చేస్తుంది.

ప్రశ్న 2: PAN 2.0 ప్రస్తుతం ఉన్న సెటప్‌తో పోలిస్తే ఎలా వేరుగా ఉంటుంది?

ప్రస్తుతం PAN సంబంధిత సేవలు మూడు వేర్వేరు పోర్టల్‌లపై ఉన్నాయ్ (e-Filing Portal, UTIITSL Portal మరియు Protean e-Gov Portal). PAN 2.0 ప్రాజెక్టులో అన్ని PAN/TAN సంబంధిత సేవలు ITD యొక్క ఏకీకృత పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. ఇందులో PAN కేటాయింపు, అప్డేషన్, సరిచేయడం, ఆన్‌లైన్ PAN ధ్రువీకరణ, AADHAAR-PAN లింకింగ్ వంటి అన్ని సేవలు ఉన్నాయి.

ప్రశ్న 3: ప్రస్తుత PAN కార్డ్ దారులు PAN 2.0 లో కొత్త PAN కోసం దరఖాస్తు చేసుకోవాలా?

అవసరం లేదు. ప్రస్తుత PAN కార్డ్ దారులకు కొత్త PAN కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

ప్రశ్న 4: PAN లో పేరు, ఇమెయిల్, చిరునామా వంటి సవరింపులు చేయవచ్చా?

అవును. ప్రస్తుత PAN కార్డ్ దారులు వారి PAN వివరాలలో ఇమెయిల్, మొబైల్, చిరునామా లేదా ఇతర డెమోగ్రాఫిక్ వివరాలు సవరించుకోవచ్చు. PAN 2.0 ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఈ సవరింపులు ఉచితంగా చేయవచ్చు.

ప్రశ్న 5: PAN 2.0 కింద నా PAN కార్డ్ మారవా?

అవసరం లేదు. PAN కార్డ్ మార్చడం అవసరం లేదు, పొరపాట్లు లేదా అప్డేట్ల కోసం మాత్రమే మారవచ్చు.

ప్రశ్న 6: కొత్త PAN కార్డ్ ఎప్పుడు డెలివరీ అవుతుంది?

ప్రస్తుత PAN కార్డ్ కలిగిన వ్యక్తులు తమ PAN లో ఎలాంటి మార్పు లేదా అప్డేట్ కోరకపోతే, కొత్త PAN కార్డ్ ఇవ్వబడదు. చిరునామా మార్చడం కావాలంటే, Aadhaar ఆధారిత ఆన్‌లైన్ సదుపాయం ద్వారా ఉచితంగా మార్పులు చేయవచ్చు.

ప్రశ్న 7: QR కోడ్ ఉన్న కొత్త PAN కార్డ్, పాత PAN కార్డ్‌లు పనికిరాకుండా చేస్తాయా?

లక్షణంగా, PAN కార్డుల్లో QR కోడ్ 2017-18 నుంచి అందుబాటులో ఉంది. PAN 2.0 లో ఈ QR కోడ్‌ను ప్రామాణికంగా అమలు చేస్తారు.

ప్రశ్న 8: “పని చేయడానికి అవసరమైన సమగ్ర వ్యాపార గుర్తింపు” అంటే ఏమిటి?

2023 బడ్జెట్‌లో, వ్యాపార సంస్థలకు PAN అవసరం ఉంటే, PANనే అన్ని డిజిటల్ వ్యవస్థల కోసం సాధారణ గుర్తింపు గాను ఉపయోగించబడుతుంది.

ప్రశ్న 9: సమగ్ర వ్యాపార గుర్తింపు PAN ను స్థానంలో ఉంచుతుందా?

అవసరం లేదు. PANనే సాధారణ వ్యాపార గుర్తింపు గాను ఉపయోగిస్తారు.

ప్రశ్న 10: “ఏకీకృత పోర్టల్” అంటే ఏమిటి?

PAN 2.0 ప్రాజెక్టు ద్వారా అన్ని PAN/TAN సంబంధిత సేవలు ITD యొక్క ఏకీకృత పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.

ప్రశ్న 11: ఎక్కువ PAN కార్డ్‌లు ఉన్న వ్యక్తులపై చర్య తీసుకోవడం ఎలా జరుగుతుంది?

PAN 2.0 లో ఎక్కువ PAN కార్డ్‌లను గుర్తించడానికి మెరుగైన వ్యవస్థలు ఉన్నాయి, తద్వారా duplicates గుర్తించి తొలగించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *