ప్రధానమంత్రి మోదీ గారు మన దేశంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజనను అధికారికంగా ప్రకటించారు, ఈ పథకం ద్వారా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటును అందిస్తామని తెలిపారు. ప్రజల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా రాయితీలు బ్యాంకు రుణాల నుండి లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో అమౌంట్ డిపాజిట్ అయ్యేంత వరకు కేంద్రమే తగు చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ గారు తెలిపారు.
ఈ పథకానికి సంబంధించిన వారందరినీ ఒక సెంట్రల్ ఆన్లైన్ పోర్టల్ తో లింక్ చేస్తామని కూడా చెప్పారు అయితే ఈ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ పొందడమే కాకుండా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సూర్యగర్ స్కీమ్ ద్వారా లబ్దిదారులు తమ ఇంటి పై కప్పుపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యుత్‌ని జనరేట్ చేసి 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ని పొందుతూనే మిగిలిన విద్యుత్‌ని డిస్కమ్ లకి అమ్ముకునే అవకాశం కల్పించనున్నారు.
మన రాష్ట్రంలో(Telangana) 300 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే వారు దాదాపుగా కోటి 31 లక్షల మంది ఉన్నట్టు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకంలో 100 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించే వారికి ఒక కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని ఇందుకు 60000 వరకు ఖర్చు అవుతుందని ఇందులో కేంద్ర ప్రభుత్వం 30000 సబ్సిడీ ఇస్తుందని మిగిలిన 30000 వినియోగదారుడు భరించాల్సి ఉంటుందని తెలపడం జరిగింది. అదే విధంగా 150 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి 2 kw సోలార్ యూనిట్ పెట్టుకోవాల్సి ఉంటుందని ఇందుకోసం 110000 ఖర్చు కాగా అందులో 60000 సబ్సిడీ మరియు మిగిలిన 50000 వినియోగదారుడు భరించాలి. ఇక 300 లోపు యూనిట్లు యూస్ చేసే వారికి 3 kw రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని ఇందుకు 165000 ఖర్చు అవుతుందని అలాగే ఇందులో 78000 సబ్సిడీ అండ్ 87000 లబ్దిదారులు భరించాలని కేంద్రం తెలిపింది.
ఈ ప్రధానమంత్రి సూర్యగర్ యోజన ద్వారా ఇంటి పై కప్పుపై సోలార్ యూనిట్లు పెట్టుకుంటే ఎండాకాలంలో ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5,6 గంటల వరకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది ఈ విద్యుత్ ని సొంతంగా వాడుకోవచ్చు లేదా డిస్కామ్ లకి అమ్ముకోవడం చేయొచ్చు. సూర్యుడి కాంతి తగ్గిపోయి చీకటి పడ్డాక అప్పటివరకు వచ్చిన సౌర విద్యుత్ ని నిల్వ చేసిన బ్యాటరీ ద్వారా కరెంటు ని వాడుకోవచ్చు ఒకవేళ ఈ విద్యుత్ ని అమ్ముకోవాలి అనుకుంటే వాటి ధరను కేంద్రమే నిర్ణయిస్తుంది.
ఈ ముఫ్త్ బిజిలీ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇందుకు సంబంధించిన ( https://www.pmsuryaghar.gov.in/ ) అనే వెబ్సైట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత ప్రస్తుత కన్స్యూమర్ నెంబరు మరియు మొబైల్ నెంబర్ తో ఇంటి పై కప్పుపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
Leave a Reply