పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్ల కొనుగోలుపై 50% సబ్సిడీ: PMKISAN TRACTOR SCHEME Complete Guide

PM KISAN TRACTOR SCHEME:

కేంద్ర ప్రభుత్వం రైతులకు సగం ధరకే ట్రాక్టర్లను అందించే స్కీమ్ ను ప్రవేశపెట్టింది. పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్ల కొనుగోలుపై 50% సబ్సిడీ తో ట్రాక్టర్ల కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. అయితే ఈ ట్రాక్టర్ యోజన ఎవరెవరికి వర్తిస్తుంది సబ్సిడీ రూల్స్ ఏంటి అవసరమైన డాక్యుమెంట్స్ దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి మరింత సమాచారం తెలుసుకుందాం.


రైతుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది, ఖర్చులు పెరగడంతో వ్యవసాయం భారంగా మారుతుందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మోడీ సర్కార్ రైతులను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇదే క్రమంలో మరొక అడుగు ముందుకు వేసి వారికి సబ్సిడీపై ట్రాక్టర్లను సైతం అందిస్తోంది. అయితే దేశంలో చాలా మంది అన్నదాతలకు ఈ స్కీమ్ గురించి తెలియదు. రైతే దేశానికి వెన్నుముక అంటారు భారత్ వ్యవసాయ ఆధారిత దేశం ఇది మనకు తెలిసిందే అయితే జనాభాలో దాదాపు సగం మంది వ్యవసాయం పైనే ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో రైతులు పొలాల్లో పని చేసేందుకు ట్రాక్టర్లు తప్పక అవసరం, వ్యవసాయ పనులకు ఇది అత్యంత ముఖ్యమైన యంత్రం పైగా పనులు చాలా సులభతరం అవుతాయి అయితే భారతదేశంలో ఉండే ప్రతి సన్న చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులే సొంత బలం ఉన్న రైతులకు కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

 కౌలు రైతులు పొలం యజమాని నుంచి ఎన్ ఓ సి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ స్కీమ్ కింద ట్రాక్టర్లను కొనుక్కోవాలి అనుకునే రైతులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం అందించే 50% సబ్సిడీ ఆ రైతు ఖాతాలోనే జమ అవుతుంది సో దీని కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతు సోదరులు తమ సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో కూడా వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది.
 

అయితే ఎవరైనా రైతు ఈస్కీమ్ కింద ట్రాక్టర్ ను కొనుగోలు చేస్తే వారు స్కీమ్ కింద అందిస్తున్న ప్రయోజనాలను పొందవచ్చు ఇది మొదటిది అంటే వారికి సగం డబ్బు ఆదా అవుతుంది కేంద్రం అందిస్తున్న ఈ సహకారం తక్కువ ఆదాయం కలిగిన చిన్న సన్నకారు రైతులకు పెద్ద వరంగా మారింది. ఈ స్కీమ్ కింద రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సబ్సిడీని అందిస్తోంది.కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వర్తిస్తుంది అయితే దీని కింద లబ్ది పొందాలనుకునే రైతులు ముఖ్యంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పైగా ప్రభుత్వం నుండి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా సదరు రైతు ఖాతాలో జమ చేస్తుంది దీని కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

షరతులు: ఇకపోతే సబ్సిడీ రూల్స్ సబ్సిడీ పొందడానికి ముఖ్యమైన షరతు ఏంటంటే ట్రాక్టర్ కొనుగోలు చేయాలనుకునే సదురు రైతు గత ఏడేళ్లలో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉండకూడదు.

రైతుకు భూమి ఉండాలి ఆ భూమి ఆ రైతు పేరు మీదే ఉండాలి.

ఒక రైతు ఒక ట్రాక్టర్ పై మాత్రమే సబ్సిడీ పొందేందుకు అర్హుడుగా ఉంటాడు.

పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతుకు ఏ సబ్సిడీ పథకం ఉండి ఉండకూడదు.

అలాగే ఆ రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ సబ్సిడీ స్కీమ్ వర్తిస్తుంది.

సదరు రైతు వయసు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి.

అవసరమైన డాక్యుమెంటులు : ఈ స్కీమ్ కింద సబ్సిడీ పొందాలనుకునే రైతు ఆధార్ కార్డు తన పేరు మీద ఉన్న భూమి డాక్యుమెంట్స్ తో పాటు ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అతనికి అకౌంట్ ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజు ఫోటో అందజేయాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి: సాధారణంగా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి కానీ కొన్ని రాష్ట్రాలలో ఆఫ్లైన్ దరఖాస్తు చేసుకునే వీలు కూడా ఉన్నాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో అయితే రైతు తాను ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను సంప్రదించాలి. తెలంగాణలో కామన్ సర్వీస్ సెంటర్ మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు తనకు ఇష్టం వచ్చిన ట్రాక్టర్ తనకు ఇష్టమైన ధరలో ఇష్టమైన కంపెనీ ట్రాక్టర్ కొనుక్కోవచ్చు తన అవసరాలకు తగ్గట్టు ఏ ట్రాక్టర్ కొనుక్కోవాలనేది రైతు ఇష్టం. 

ఇప్పుడు ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్ అయినటువంటి (https://pmkisan.gov.in) ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత దరఖాస్తు విండో అనేది ఓపెన్ అవుతుంది, రైతుల కోసం పిఎం కిసాన్ వెబ్సైట్ లో ప్రత్యేకించి హెల్ప్ లైన్ కూడా ఉంటుంది.

మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆ వెబ్సైట్ లోకి వెళ్లి కూడా హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఇంకా మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *