తెలంగాణ ప్రభుత్వం రైతులకు 100% సబ్సిడీ తో రైతులకు డ్రిప్ అందిస్తుంది . ఈ డ్రిప్ కోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎవరికీ వర్తిస్తుంది ?
చిన్న , సన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది , పండ్ల తోటలు , పులా తోటలు , కూరగాయలు సాగు చేయు వారికీ ఒక ఎకరం నుండి 12 ఎకరాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఈ వ్యవసాయ భూమి లో బోరు లేదా బావి ఉండాలి , సబ్సిడీ ఎస్ స్సీ /ఎస్ టి రైతులకు 100 శాతం మరియు ఇతరులకు 90 శాతం వరకు ఉంటుంది. దీనికోసం మీరు సంబంధిత హార్టికల్చర్ ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు .
గమనిక : 100 శాతం సబ్సిడీ ఉన్న జి ఎస్ టి మాత్రం రైతులు భరించాల్సి ఉంటుంది.
కావాల్సిన పత్రాలు :
పొలం పాస్ బుక్ ,
ఆధార్ కార్డు ,
కుల ధ్రువీకరణ పత్రం ,
బ్యాంకు అకౌంట్ పాసుబుక్ ,
రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు .
దరఖాస్తు చేయువిధానం :
జిల్లా ఉద్యానవన కార్యాలయం (డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీస్) కు వెళ్లి సంప్రదించండి, అక్కడ అధికారులు మీ వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేస్తారు.
Leave a Reply